Pages

ఏముకో చిగురుటధరమున

Thursday, 5 February 2009

సాహిత్యం - అన్నమాచార్య


ఏముకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను ।
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా ॥

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచెనే ।
చెలువంబిప్పటిదేమో చింతింపరే చెలులు ।
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనచూపులు ।
నిలువుగపెరుకగనంటిన నెత్తురు కాదుకదా ॥౧॥

పడతికి చనుగవ మెరుగులు పైపై పయ్యెద వెలుపల ।
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు ।
ఉడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు ।
వెడలగ వేసవికాలపు వెన్నెల కాదుకదా ॥౨॥

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పులు ।
ఒద్దిక బాగులివేమో ఊహింపరే చెలులు ।
గద్దరి తిరువేంకటపతి కౌగిటి అధరామృతముల ।
అద్దిన సురతపు చెమటల అందము కాదుకదా ॥౩॥

0 comments:

Popular Posts