Pages

Showing posts with label చిత్రం-మేఘసందేశం. Show all posts
Showing posts with label చిత్రం-మేఘసందేశం. Show all posts

నిన్నటిదాకా శిలనైనా

Saturday, 7 July 2012

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-మేఘసందేశం
సంగీతం-రమేశ్ నాయుడు
గాయనం-పి.సుశీల


నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి-గంగనై పొంగుతూ ఉన్నా॥

సరససరాగాల సుమరాణిని
స్వరససంగీతాల సారంగిని
మువ్వమువ్వకు ముద్దుమురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాసశిఖరాల శైలూశిఖానాట్యఢోలలూగేవేళ రావేల నన్నేల ॥౧॥

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వుపువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్నప్రపంచాల సౌందర్యదీపాలు చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల ॥౨॥

Read more...

ఆకులో ఆకునై

Wednesday, 17 August 2011

సాహిత్యం - దేవులపల్లి కృష్ణశాస్త్రి
చిత్రం-మేఘసందేశం
సంగీతం - రమేశ్ నాయుడు
గాయనం - పి.సుశీల


ఆకులో ఆకునై
పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై
నునులేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా ॥

గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా ॥౧॥

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెఱ్ఱినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా ॥౨॥

Read more...

Popular Posts