Pages

Showing posts with label వేటూరి సుందరరామమూర్తి. Show all posts
Showing posts with label వేటూరి సుందరరామమూర్తి. Show all posts

ఎడారిలో కోయిల

Wednesday, 19 December 2012

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-పంతులమ్మ (౧౯౭౭)
సంగీతం-రాజన్-నాగేంద్ర
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పాడింది కన్నీటి పాట

"పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే !"

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత
కల ఆయితే, శిల అయితే, మిగిలింది ఈ గుండెకోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత
.. విధిరాతచేత.. నా స్వర్ణసీత

"కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ !
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!"

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట
.. చెలిలేని పాట.. ఒక చేదుపాట

Read more...

నిన్నటిదాకా శిలనైనా

Saturday, 7 July 2012

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-మేఘసందేశం
సంగీతం-రమేశ్ నాయుడు
గాయనం-పి.సుశీల


నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి-గంగనై పొంగుతూ ఉన్నా॥

సరససరాగాల సుమరాణిని
స్వరససంగీతాల సారంగిని
మువ్వమువ్వకు ముద్దుమురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాసశిఖరాల శైలూశిఖానాట్యఢోలలూగేవేళ రావేల నన్నేల ॥౧॥

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వుపువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్నప్రపంచాల సౌందర్యదీపాలు చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల ॥౨॥

Read more...

రవివర్మకే అందని

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-రాముడే రావణుడైతె (1978)
సంగీతం-జి.కె.వెంకటేశ్
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో ॥

ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
నీ పాటలే పాడనీ ॥౧॥

ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
కదలాడని ఆడనీ ॥౨॥

Read more...

మౌనమేలనోయి

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-సాగర సంగమం
సంగీతం-ఇళయరాజా
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ


మౌనమేలనోయి, ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల
వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇక మౌనమేలనోయి, ఈ మరపు రాని రేయి ॥

పలికే పెదవి వొణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా
విరిసే వయసులా
నీలి నీలి వూసులు
లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా ॥౧॥

హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా
వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు
కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన ॥౨॥

Read more...

జల్లంత కవ్వింత

Wednesday, 17 August 2011

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-గీతాంజలి
సంగీతం - ఇళయరాజ
గాయనం - ఎస్.పి.బాలసుబ్రమణ్యం


జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు, పఱుగులు, ఉడుకువయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెఱుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే ॥

వాగులూ వంకలు జలజల చిలిపిగా పిలిచినా
గాలులూ వానలు చిటపట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కొండచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి వెల్లదాయె
కళ్ళులేని దేవుడెందుకో మరి ॥౧॥

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగ
వానదేవుడె కల్లాపి జల్లగ
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్తపాట పుట్టుకొచ్చె ఎవరికొసమో ॥౨॥

Read more...

ఏ కులము

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-సప్తపది
సంగీతం - కె.వి.మహదేవన్
గాయనం - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ॥

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ॥౧॥

ఆదించి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉఱుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు ॥౨॥

Read more...

ఆమని పాడవే హాయిగా

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-గీతాంజలి
సంగీతం-ఇళయరాజ
గాయనం - ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఆమని పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళలా ॥

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కథ క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేనని ॥౧॥

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువి కలా నిజం సృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని ॥౨॥

Read more...

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

Friday, 16 July 2010

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-సప్తపది
సంగీతం-కె.వి.మహదేవన్
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి ॥

కాళింది మడుగున కాళీయుని పడగన
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ॥౧॥
ఇదేనా .. ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మఱల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ॥౨॥
ఇదేనా .. ఇదేనా ఆ మురళి

వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి, మువ్వల మురళి, ఇదేనా ఆ మురళి ॥

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ॥౩॥
ఇదేనా .. ఇదేనా ఆ మురళి

Read more...

Popular Posts