Pages

Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో

Tuesday, 27 August 2013

సాహిత్యం - సీ.నారాయణరెడ్టి
చిత్రం-పూజాఫలం (౧౯౬౪)
సంగీతం-సాలూరి రాజేశ్వర రావు
గాయనం-ఘంటసాల వెంకటేశ్వర రావు


నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ॥

తెలియరాని రాగమేదో తీగె సాగెనెందుకో
నాలో .. నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ॥

పూచిన ప్రతి తరువొక వధువు
పూవు పూవున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో ॥౧॥

చెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే ॥౨॥

పసిడి అంచు పైట జార
పయనించే మేఘ బాల
అరుణ కాంతి సోకగానే పరవశించెనే ॥౩॥

Read more...

ప్రెమ లేదని, ప్రేమించరాదని

Monday, 25 February 2013

సాహిత్యం-ఆత్రేయ
చిత్రం-అభినందన (౧౯౮౮)
సంగీతం-ఇళయరాజా
గానం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం



ప్రెమ లేదని, ప్రేమించరాదని,
సాక్ష్యమే నీవని, నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు ॥

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ఉసురుకప్పి మూగవోయి నీ ఉపిరి
మోడువారి నీడ తోడు లేకుంటిని ॥౧॥

గుఱుతు చేఱిపివేసి జీవించాలని
చెఱపలేకపోతే మరణించాలని
తెలిసికూడా చేయ్యలేని వెఱ్ఱివాడిని
గుండే పగిలిపోవువరకు నన్ను పాడనీ
ముక్కలలో లేక్కలేని రూపాలలో
మఱలమఱల నిన్ను చూసి రోదించనీ ॥౨॥

Read more...

ఎడారిలో కోయిల

Wednesday, 19 December 2012

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-పంతులమ్మ (౧౯౭౭)
సంగీతం-రాజన్-నాగేంద్ర
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పాడింది కన్నీటి పాట

"పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే !"

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత
కల ఆయితే, శిల అయితే, మిగిలింది ఈ గుండెకోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత
.. విధిరాతచేత.. నా స్వర్ణసీత

"కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ !
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!"

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట
.. చెలిలేని పాట.. ఒక చేదుపాట

Read more...

నిన్నటిదాకా శిలనైనా

Saturday, 7 July 2012

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-మేఘసందేశం
సంగీతం-రమేశ్ నాయుడు
గాయనం-పి.సుశీల


నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి-గంగనై పొంగుతూ ఉన్నా॥

సరససరాగాల సుమరాణిని
స్వరససంగీతాల సారంగిని
మువ్వమువ్వకు ముద్దుమురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాసశిఖరాల శైలూశిఖానాట్యఢోలలూగేవేళ రావేల నన్నేల ॥౧॥

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వుపువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్నప్రపంచాల సౌందర్యదీపాలు చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల ॥౨॥

Read more...

మధుమాస వేళలో

సాహిత్య - దాశరథి
చిత్రం-అందమే ఆనందం
సంగీతం-సత్యం
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం


మధుమాస వేళలో
మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో ॥

ఆడింది పూల కొమ్మ పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగే వేళ నాలో రగిలే ఏదో జ్వాల ॥౧॥

ఉదయించె భానుబింబం వికసించలేదు కమలం
నెలరాజు రాకకోసం వేచింది కన్నె కుమురం
వలచింది వేదనంకేనా జీవితమంతా దూరలేనా ॥౨॥

Read more...

రవివర్మకే అందని

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-రాముడే రావణుడైతె (1978)
సంగీతం-జి.కె.వెంకటేశ్
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో ॥

ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
నీ పాటలే పాడనీ ॥౧॥

ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
కదలాడని ఆడనీ ॥౨॥

Read more...

మౌనమేలనోయి

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-సాగర సంగమం
సంగీతం-ఇళయరాజా
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ


మౌనమేలనోయి, ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల
వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇక మౌనమేలనోయి, ఈ మరపు రాని రేయి ॥

పలికే పెదవి వొణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా
విరిసే వయసులా
నీలి నీలి వూసులు
లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా ॥౧॥

హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా
వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు
కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన ॥౨॥

Read more...

జాబిల్లి కోసం ఆకాశమల్లే

సాహిత్యం - ఆత్రేయ
చిత్రం-మంచి మనసులు
సంగీతం-ఇళయరాజా
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం


జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ।
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై ॥

నువ్వక్కడ నేనిక్కడ
పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉఱ్ఱూతలూగి
మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీ ॥౧॥

నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే ॥౨॥

Read more...

పల్లవించవా నా గొంతులో

Tuesday, 22 May 2012

సాహిత్యం - ఆత్రేయ
చిత్రం-కోకిలమ్మ
సంగీతం-ఎం.ఎస్.విశ్వనాథన్
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం


పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

నేనున్నది నీలోనే
ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడు మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమనీ
ఇదే నాకు వరమనీ
చెప్పాలని ఉంది
గుండె విప్పాలని ఉందీ

నీ ప్రేమకు కలశాన్ని
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమనీ
ఇదే నిజం అనమనీ
చెప్పాలని ఉంది గుండె
విప్పాలని ఉందీ

Read more...

జయభేరి

Saturday, 27 August 2011

సాహిత్యం - శ్రీశ్రీ
కావ్యసంకలనం - మహాప్రస్థానం


నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

నేను సైతం
విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!

నెను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.

ఎండ కాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగి పోలేదా!

వాన కాలం ముసరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?

శీత కాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేక లేశానే!

నే నొకణ్ణీ
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్న మౌతాయి!

నింగినుండీ తొంగి చూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొక్కణ్ణి ధాత్రినిండా
నిండి పోయీ,
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!

నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

Read more...

प्रिय भारत जनयित्री / ప్రియ భారత జనయిత్రీ

Thursday, 25 August 2011

साहित्यम् - देवुलपल्लि कृष्णशात्रि

जय जय जय प्रिय भारत जनयित्री दिव्य धात्री ।
जय जय जय शतसहस्रनरनारीहृदयनेत्री ॥

जय जय जय सुश्यामलसस्यचलच्चेलांचल
जय वसंतकुसुमलताचलित ललितचूर्णकुंतल
जय मदीय हृदयाशयलाक्षारुणपदयुगळा ॥१॥

जय दिशांतगतशकुंत दिव्यगानपरितोषण
जय गायकवैताळिकगळ विशालपतविहरण
जय मदीय मधुरगेयचुंबित सुंदरचरणा ॥२॥

సాహిత్యం - దేవులపల్లి కృష్ణశాస్త్రి

జయ జయ జయ ప్రియ భారతజనయిత్రీ దివ్యధాత్రి ।
జయ జయ జయ శతసహస్రనరనారీహృదయనేత్రి ॥

జయ జయ జయ సుశ్యామలసస్యచలచ్చేలాంచల
జయ వసంతకుసుమలతాచలిత లలితచూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయలాక్షారుణపదయుగళా ॥౧॥

జయ దిశాంతగతశకుంత దివ్యగానపరితోషణ
జయ గాయకవైతాళికగళ విశాలపదవిహరణ
జయ మదీయ మధురగేయచుంబిత సుందరచరణా॥౨॥

Read more...

ఏ దేశమేగినా

సాహిత్యం - రాయప్రోలు సుబ్బారావు

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లిభూమి భారతిని
నిలపరా నీ జాతి నిండుగౌరవము

ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవియెందూ !
లేరురా మనవంటి పౌరులింకెందు !

సూర్యునీ వెలుతురుల్ సోకునందాక
ఓడలా ఝండాలు ఆడునందాక
అందాకగల ఈ అనంతభూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు

పాడరా నీ వీరభావభారతము !

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర

వెలిగినదీ దివ్య విశ్వంబు పుత్ర !
దీవించె నీ దివ్యదేశంబు పుత్ర !

పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానలా కస్తూరి కాచరా మనకు

అవమానమేలరా?! అనుమానమేలరా?!
భారతీయుడనంచు భక్తితో పాడ!

Read more...

మా తెలుగు తల్లికి

సాహిత్యం - శంకరంబాడి సుందరాచారి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ ।
మా కన్న తల్లికి మంగళారతులు ॥

కడుపులో బంగారు కనుచూపులో కరుణ ।
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి ॥౧॥

గలగలా గోదారి కదలిపోతుంటేను ।
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను ।
బంగారు పంటలే పండుతాయి ।
మురిపాల ముత్యాలు దొరలుతాయి ॥౨॥

అమరావతీ నగర అపురూప శిల్పాలు ।
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు ।
తిక్కయ్య కలములో తియ్యందనాలు ।
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక ॥౩॥

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి ।
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి ।
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక ।
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం ॥౪॥

॥ జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! ॥

Read more...

కన కన రుచిర

సాహిత్యం - త్యాగరాజ


కనకన రుచిర కనకవసన, నిన్ను ॥

దినదినమును (అను)
మనసున చనువున నిన్ను ॥౧॥

పాలుగారుమోమున శ్రీయపారమహిమ దనరు నిన్ను ॥౨॥

తళతళమను ముఖకళగలిగిన సీత
కులుకుచునోరకన్నులనుజూచే నిన్ను ॥౩॥

బాలార్కభసుచేల మణిమయమాలాలంకృతకంధర
సరసిజాక్ష వరకపోల సురుచిరకిరీటధర సంతతంబు మనసారగ ॥౪॥

సాపత్నిమాతయౌ సురుచిచే కర్ణశూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి సుఖియింపగలేదా యటు ॥౫॥

మృగమదలలామ శుభనిటిల వరజటాయుమోక్షఫలద
పవమానసుతుడు నీదు మహిమదెల్ప సీతదెలిసి
వలచి సొక్కలేదా ఆ రీతి నిన్ను ॥౬॥

సుఖాస్పదవిముఖాంబుధర పవనవిదేహమానసవిహారాప్త
సురపూజమానితగుణాంక చిదానంద ఖగతురంగ ధృతరథాంగ
పరమదయాకర కరుణారసవరుణాలయ భయాపహర శ్రీరఘుపతే ॥౭॥

కామించి ప్రేమమీద కరముల నీదు పాదకమలములబట్టుకొనువాడు సాక్షి
రామనామరసికుడు కైలాససదనుడు సాక్షి
మరియు నారదపరాశరశుకశౌనకపురంధరనగజాధరజముఖ్యులు సాక్షిగాదా
సుందరేశ సుఖకలశాంబుధివాసాశ్రితులకే ॥౮॥

సతతము ప్రేమపూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను ॥౯॥

Read more...

సాధించెనే ఓ మనసా

సాహిత్యం - త్యాగరాజ


సాధించెనే ఓ మనసా ।
బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు ॥

సమయానికి తగు మాటలాడెనే ॥

దేవకీవసుదేవులనేగించినటు ॥౧॥

రంగేశుడు సద్గంగాజనకుడు సంగీతసంప్రదాయకుడు ॥౨॥

గోపీజన మనోరథమొసంగలేకనే గేలియుజేసేవాడు ॥౩॥

సారాసారుడు సనకసనందనసన్మునిసేవ్యుడు సకలాధారుడు ॥౪॥

వనితల సదా సొక్కజేయుచును మ్రొక్కజేసే
పరమాత్ముడదియుగాక యశోదతనయుడనుచు
ముదంబునను ముద్దుబెట్ట నవ్వుచుండు హరి ॥౫॥

పరమభక్తవత్సలుడు సుగుణపారావారుండాజన్మ మనగుడి
కలిబాధలదీర్చువాడనుచునే హృదంబుజమునజూచుచుండగ హరి ॥౬॥

హరేరామచంద్ర రఘుకులేశ మృదుసుభాష శేషశయన
పరనారి సోదరాజవిరాజ తురగరాజరాజనుత నిరామయాపఘన
సరసీరుహదలాక్షయనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను ॥౭॥

శ్రీవేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానసనికేతన
కనకాంబరధరలసన్మకరకుండల విరాజిత హరేయనుచు నే
పొగడగా త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు ॥౮॥

సద్భక్తుల నడతలిట్లనెనే అమరికగా నా పూజగొనెనే
అలుగవద్దననే
విముఖులతో జేరబోకుమనెనే
వెతగలిగిన తాళుకొమ్మననే
దమశమాది సుఖదాయకుడగు శ్రీత్యాగరాజనుతుడు చెంతరాకనే ॥౯॥

Read more...

దుడుకుగల

సాహిత్యం - త్యాగరాజ



దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా, ఎంతో ॥

కడు దుర్విషయాకృశ్టుడై గడియగడియకు నిండారు ॥౧॥

శ్రీవనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర ॥౨॥

సకలభూతములయందు నీవైయుండగ మదిలేకపోయిన ॥౩॥

చిరుతప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన ॥౪॥

పరధనములకొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింపదిరిగినట్టి ॥౫॥

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమేయనుచు
సదా దినములు గడిపెడి ॥౬॥

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌటకుపదశించి
సంతసిల్లి స్వరలయంబులెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను ॥౭॥

దృష్టికి సారంబగు లలనా సదనార్భకసేనామిత ధనాదులను
దేవాధిదేవ నెరనమ్మితినిగాకను పదాబ్జభజనంబు మరచిన ॥౮॥

చక్కని ముఖకమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచేదగిలి నొగిలి
దుర్విషయ దురాశలను రోయలేక సతతమపరాధినై చపలచిత్తుడైన ॥౯॥

మానవతను దుర్లభమనుచునెంచి పరమానందమొందలేక
మదమత్సరకామలోభమోహములకు దాసుడై మోసబోతిగాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక
నరాధములనురోయ సారహీనమతములను సాధింప తారుమారు ॥౧౦॥

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధనతతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి ॥౧౧॥

Read more...

ఎందరో మహానుభావులు

సాహిత్యం - త్యాగరాజ



ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ॥

చందురువర్ణుని అందచందమును హృదయారవిందమునజూచి
బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులు ॥౧॥

సామగానలోల మనసిజలావణ్య
ధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు ॥౨॥

మానసవనచరవరసంచారమునెరిపి మూర్తి బాగుగ
పొగడనేవారెందరో మహానుభావులు ॥౩॥

సరగున పాదములకు స్వాంతమను సరోజమును
సమర్పణము సేయువారెందరో మహానుభావులు ॥౪॥

పతితపావనుడనే పరాత్పరునిగురించి
పరమార్ధమగు నిజమార్గముతోనుబాడుచును సల్లాపముతో
స్వరలయాదిరాగములదెలియువారెందరో మహానుభావులు ॥౫॥

హరిగుణమణిమయసరములు గళమున శోభిల్లు
భక్తకోటులిలలో తెలివితో చెలిమితో కరుణగల్గి
జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు ॥౬॥

హొయలుమీర నడలుగల్గ్గు సరసుని సదా
కనులజూచుచును పులకశరీరులై
ఆనందపయోధినిమగ్నులై ముదంబునను
యశముగలవారెందరో మహానుభావులు ॥౭॥

పరమభాగవతమౌనివర శశివిభాకర సనకసనందన
దిగీశ సురకింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవసుఖము సదానుభవులుగాక ఎందరో మహానుభావులు ॥౮॥

నీ మేనునామ వైభవంబులను
నీ పరాక్రమధైర్యముల శాంతమానసము
నీవులను వచనసత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్లజేసినట్టి నీమదినెరింగి
సంతసంబునను గుణభజనానందకీర్తనముజేయువారెందరో మహానుభావులు ॥౯॥

భాగవతరామాయణగీతాదిశృతిశాస్త్రపురాణపు మర్మములను
శివాదిషణ్మతముల గూఢములన్
ముప్పదిముక్కోటిసురాంతరంగముల భావంబులనెరిగి
భావరాగలయాదిసౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధిసుఖాత్ములై త్యాగరాజాప్తులైనవారెందరో మహానుభావులు ॥౧౦॥

ప్రేమ ముప్పిరిగొనువేళ నామమునుదలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజదాసులైననవారెందరో మహానుభావులు ॥౧౧॥

Read more...

మఱుగేలరా ఓ రాఘవా

సాహిత్యం - త్యాగరాజ



మఱుగేలరా ఓ రాఘవా ।
మఱుగేల చరాచరరూప పరాత్పర సూర్యసుధాకరలోచన ॥

అన్నీ నీవనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య ।
నిన్నెగాని మదినెన్నజాలనొరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత ॥౧॥

Read more...

నడిరేయి ఏ జాములో

Wednesday, 17 August 2011

సాహిత్యం - దాశరథి
చిత్రం-రంగులరాట్నం
సంగీతం-సాలూరి రాజేశ్వర రావు
గాయనం-ఫంటసాల వెంకటేశ్వర రావు, ఎస్.జానకి


నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో ॥

మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా ॥౧॥

ఏడెడు శిఖరాలనే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా... మముగన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా॥౨॥

కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొఱలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
అడగవె మా తల్లి అనురాగవల్లి
అడగవె మాయమ్మ అలివేలుమంగా ॥౩॥

Read more...

ఏ దివిలో విఱిసిన

సాహిత్యం - దాశరథి
చిత్రం-కన్నెవయసు
సంగీతం-సత్యం
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఏ దివిలో విఱిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే ॥

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ॥౧॥

పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలియందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే ॥౨॥

నిదురమబ్బులను మెఱుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకువీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదముపదములో మధువులూరగా కావ్యకన్యవై రావే ॥౩॥

Read more...

Popular Posts