నడిరేయి ఏ జాములో
Wednesday, 17 August 2011
సాహిత్యం - దాశరథి
చిత్రం-రంగులరాట్నం
సంగీతం-సాలూరి రాజేశ్వర రావు
గాయనం-ఫంటసాల వెంకటేశ్వర రావు, ఎస్.జానకి
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో ॥
మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా ॥౧॥
ఏడెడు శిఖరాలనే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా... మముగన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా॥౨॥
కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొఱలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
అడగవె మా తల్లి అనురాగవల్లి
అడగవె మాయమ్మ అలివేలుమంగా ॥౩॥
0 comments:
Post a Comment