Pages

కన కన రుచిర

Thursday, 25 August 2011

సాహిత్యం - త్యాగరాజ


కనకన రుచిర కనకవసన, నిన్ను ॥

దినదినమును (అను)
మనసున చనువున నిన్ను ॥౧॥

పాలుగారుమోమున శ్రీయపారమహిమ దనరు నిన్ను ॥౨॥

తళతళమను ముఖకళగలిగిన సీత
కులుకుచునోరకన్నులనుజూచే నిన్ను ॥౩॥

బాలార్కభసుచేల మణిమయమాలాలంకృతకంధర
సరసిజాక్ష వరకపోల సురుచిరకిరీటధర సంతతంబు మనసారగ ॥౪॥

సాపత్నిమాతయౌ సురుచిచే కర్ణశూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి సుఖియింపగలేదా యటు ॥౫॥

మృగమదలలామ శుభనిటిల వరజటాయుమోక్షఫలద
పవమానసుతుడు నీదు మహిమదెల్ప సీతదెలిసి
వలచి సొక్కలేదా ఆ రీతి నిన్ను ॥౬॥

సుఖాస్పదవిముఖాంబుధర పవనవిదేహమానసవిహారాప్త
సురపూజమానితగుణాంక చిదానంద ఖగతురంగ ధృతరథాంగ
పరమదయాకర కరుణారసవరుణాలయ భయాపహర శ్రీరఘుపతే ॥౭॥

కామించి ప్రేమమీద కరముల నీదు పాదకమలములబట్టుకొనువాడు సాక్షి
రామనామరసికుడు కైలాససదనుడు సాక్షి
మరియు నారదపరాశరశుకశౌనకపురంధరనగజాధరజముఖ్యులు సాక్షిగాదా
సుందరేశ సుఖకలశాంబుధివాసాశ్రితులకే ॥౮॥

సతతము ప్రేమపూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను ॥౯॥

0 comments:

Popular Posts