Pages

మా తెలుగు తల్లికి

Thursday 25 August 2011

సాహిత్యం - శంకరంబాడి సుందరాచారి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ ।
మా కన్న తల్లికి మంగళారతులు ॥

కడుపులో బంగారు కనుచూపులో కరుణ ।
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి ॥౧॥

గలగలా గోదారి కదలిపోతుంటేను ।
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను ।
బంగారు పంటలే పండుతాయి ।
మురిపాల ముత్యాలు దొరలుతాయి ॥౨॥

అమరావతీ నగర అపురూప శిల్పాలు ।
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు ।
తిక్కయ్య కలములో తియ్యందనాలు ।
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక ॥౩॥

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి ।
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి ।
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక ।
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం ॥౪॥

॥ జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! ॥

0 comments:

Popular Posts