Pages

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

Friday 16 July 2010

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
చిత్రం-సప్తపది
సంగీతం-కె.వి.మహదేవన్
గాయనం-ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి ॥

కాళింది మడుగున కాళీయుని పడగన
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ॥౧॥
ఇదేనా .. ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మఱల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ॥౨॥
ఇదేనా .. ఇదేనా ఆ మురళి

వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి, మువ్వల మురళి, ఇదేనా ఆ మురళి ॥

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ॥౩॥
ఇదేనా .. ఇదేనా ఆ మురళి

Read more...

Popular Posts